వివాహ శుభాకాంక్షలు2

పరిణయ శుభాకాంక్షలు
=====================

పచ్చని తోరణాలు స్వాగతం పలకగా
వికసింప బోయే పూల పరిమళం పలకరించగా
ఆ పలకరింపులే పన్నీరు జల్లుగా మారగా
పరవశించిన మనసులో కలిగిన పులకింతలతో
పాలపుంత మధ్యలో పల్లకిలో ఊరేగిన భావన కలగగా

 

పొంగి పొరలే ప్రేమానురాగాలతో ప్రమాణాలే పల్లవి కాగా
వేదమంత్రాలు చరణాలై జత కాగా కమ్మని పాట కాగా

 

బంధుమిత్రులు సాక్షులుగా ప్రేక్షకులై దీవించగా
తాళి తనువును తాకగా
తారలను తలంబ్రాలుగా జల్లగా

 

ప్రేమ పాదాభివందనం చేసి
పరిణయ బంధం గా మారిన ప్రతిక్షణం మీ పతి సతుల మదిలో పదిలం కాగా

 

మీ జీవిత పయనం హాయిగా
ప్రేమను పంచుకొంటూ, పెంచుకుంటూ సాగాలని ఆ పార్వతి పరమేశ్వరులను వర్తిస్తూ
మరియొక సారీ పరిణయ శుభాకాంక్షలతో
========================
—మీ రాజీప్రతాప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *