మహిళ దినోత్సవ శుభాకాంక్షలు

మహిళ దినోత్సవ శుభాకాంక్షలు
====================
ఓ వనిత నీకు వందనం

అడుగడుగునా ఒడిదుడుకులతో
ఇమడలేని నీ బతుకు బండి

కామాంధుల పడగ తాకిడి
దుర్మార్గపు దోపిడీ
గుండెల్లో అలజడి
కళ్ళనిండా తడి

అమ్మ ఒడి
చదువుల బడి
దేవుని గుడి
రక్షణ లేదు నీకు ఎక్కడ

పిండం పెరిగి కడుపు దాటడానికి గండం
ఎదిగిన బిడ్డ గడపదాటితే సుడిగుండం

కొత్త పోకడలు, ఆడంబరాలతో
ధరించే జానెడు గుడ్డతో
పరువాలు జారవిడిచే పడుచు పిల్ల
గాడ స్నేహం పేరుతో హద్దులు, శరీర సరిహద్దులు మరచి , గంటల తరబడి మాట్లాడి మిడిసి పడకే

ఆహ్వానించకే ఆనుకుని ఉన్న ఆపదను
నడత మార్చుకోకపోతే కలత తప్పదు

ప్రతి మగవాడు మంచి నడవడికతో
ఆడబిడ్డ మనుగడకు కొండంత అండగా
బాధ్యతల గొడుగై నీడగా,
తోడుగా నిలబడి
కంటికి రెప్పలా కాపాడాలి.

వనిత
పురాణ పూజిత
ఇంటికి దేవత
అందిస్తున్నావు ఆప్యాయత
పంచుతున్నావు మరువరాని మమత

ఆడపడుచా అందుకో అందరి అభినందనలు

మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో

— మీ రాజీప్రతాప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *