నూతన సంవత్సర శుభాకాంక్షలు2

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
=========================

నిదురించిన నిన్నటి నిమిషాలు నీడై మదిలో చేసిన సంతకం

నడుస్తున్న నేటి క్షణాలు నవ్వుల రేకుల్ని పువ్వులుగా అందిస్తున్న సంతోషం

ఉదయించే రేపటి రోజులు కొత్త ఊహలకు ఊతమిచ్చే సందర్భం

గట్టుమీద ఉన్న చెట్టును కొనగలం
చెట్టు మీద ఉన్న పిట్టను కొనగలం
పిట్ట పెట్టె గుడ్డును కొనగలం
ఇడ్లీలను కొనగలం
ఇడ్లీలను తినే దేహం లో ఉన్న కిడ్నీలను కొనగలం

కానీ కరిగిపోయిన కాలంలోని క్షణాలను మాత్రం కొనలేం
ఇది మనకందరికీ తెలిసిన మర్మం లేని తర్కం
కాలాన్ని సద్వినియోగపరుచు కోవడం మనకందరికీ అనివార్యం
ఇది తెలియకుంటే మన ఖర్మం
తెలుసుకొనడం మన ధర్మం

కాకమ్మ కథలతో కాలక్షేపం చేయకుండా కాలంతో జత కట్టి
చల్లారని సంకల్పంతో అడుగడుగునా ఆత్మవిశ్వాసంతో
సాగాలి జీవిత పయనం చేరాలి గమ్యం
ఇదే నూతన సంవత్సర సందేశం

మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో
—మీ రాజీ ప్రతాప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *