X

కళాశాల తీపి గుర్తులు -2

కళాశాల తీపి గుర్తులు -2 ( రెండవ భాగం)
*****************************************
తర్వాత ఇంకొక సీనియర్
మాములుగా SD ..

సీనియర్ : మీ క్లాస్ అమ్మాయిలతో మాట్లాడవా ?
నేను : లేదు సార్

సీనియర్ :కనీసం పేర్లు ఐనా తెలుసా ?
నేను : కొంతమంది పేర్లు విన్నాను సార్

సీనియర్ :మీ ఇంటర్ క్లాసుమేట్ ఒక అమ్మాయి ఒకరు ఉన్నారు. ఆ అమ్మాయిని ఐనా పలకరించావా ?
నేను : లేదు సార్

సీనియర్ :మీ క్లాస్ అమ్మాయిల అందరి డీటెయిల్స్ తెలుసుకొని రేపు చెప్పు.

అమ్మాయిల వివరాలు వాళ్లని ఎలా అడగాలో , ఆడిగేతే చెప్తారో లేదో అనే ఆలోచనతో మరుసటి రోజు కంప్యూటర్ ల్యాబ్ ముందు
క్లాసుమేట్ అమ్మాయిని కలిసాను.

ఆమె మొదట పలకరించింది ( ఎందుకంటే నేను ఆ అమ్మాయిని ఇంటర్లో ఒక్క సారీ కూడా పలకరించలేదు. ఆ అమ్మాయినే కాదు ఏ అమ్మాయిని పలకరించలేదు. పలకరించే ధైర్యము లేదు. ఇది నిజం మీరు నమ్మిన నమ్మక పోయినా )

క్లాసుమేట్ అమ్మాయి : సారీ అండీ. మీరు గుర్తులేదు నాకు. నిన్న మీ గురుంచి సీనియర్ అన్న చెప్పే వరకు

(same సీనియర్ నన్ని అమ్మాయిల అందరి వివరాలు తెలుసుకొని రమ్మని చెప్పాడో అదే సీనియర్ క్లాసుమేట్ అమ్మాయికి చెప్పాడు)

(ఇక్కడ క్లాసుమేట్ అమ్మాయికి నేను గుర్తులేదు అనడంలో వింతేమీ లేదు. అబ్బాయిలికి అమ్మాయిలు గుర్తులేక పోతే ఆశ్చర్యం కానీ.
ఎందుకంటే ఇంటర్ లో ప్రభుత్వ కళాశాలలో చదివిన నేను పల్లె నుండి టౌన్ కి సైకిలో వెళ్లి చివర వరుసలో కుర్చునేవాణ్ణి.
అన్ని సబ్జెక్టు ట్యూషన్స్ కి వెళ్ళేవాణ్ణి కాదు. తర్వాత డిగ్రీ త్రీ ఇయర్స్ వేరేచోట. నేను ఎలా గుర్తుంటాను ఆ అమ్మాయికి.
అందుకే MCA లో మొదట బెంచ్లో కుర్చునేవాణ్ణి కనీసం పలకరించకపోయిన గుర్తులేదు అనే ఛాన్స్ ఏ అమ్మాయికి ఇవ్వకూడదని)

నేను: పర్వాలేదులెండి. చిన్న సహాయం. మీ అమ్మాయిల అందరి వివరాలు కావాలి. సీనియర్ అడిగాడు.
ఆ అమ్మాయి అందరి అమ్మాయిల వివరాలు ఇచ్చినది.

ఆ రోజు మధ్యాహ్నం మరల ఆ సీనియర్నికలసి అమ్మాయిల వివరాలు చెప్పాను.
సీనియర్: ఈ వివరాలు నీకు ఎలా తెలిసాయి
నేను: మా క్లాసుమేట్ అమ్మాయి ఇచ్చింది.

సీనియర్: ఇంకా ఏమి చెప్పింది
నేను: ఎవరో సీనియర్ అన్న నా గురుంచి చెప్పాడని చెప్పినది.

సీనియర్: అన్న అని అందా?
నేను: అవును

other సీనియర్స్: బావా… నీకు 9 మంది చెల్లెలు ….ఎంత అదృష్టం.
“నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా”….

అతని మొఖం చూడాలి…..
కొన్ని సార్లు పైన ఉన్న దేవతలు తధాస్తు అంటారు అనడానికి ఉదాహరణం
అతనికి తర్వాత నిజంగానే మా క్లాసులో ఒక అమ్మాయి చెల్లెమ్మ అయంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
–రాజీప్రతాప్
********************************************

Prathap Reddy:
Related Post