*********************
ముందు భాగం – కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులు-3 (తొలిప్రేమలో లాంటి తొలిచూపు)
************************
మరుసటి రోజు ఉదయం
ప్రదేశం – ఇరువరం కళ్యాణ మండపం(అదేనండీ కళాశాలలో )
పెళ్ళికి అక్షింతలు వేసే దానికి వచ్చే అతిదిలు కూచునె ప్రదేశంలో plywood sheets తో divide చేసిన క్లాసు రూంలలో, ఒక రూంలో క్లాసు లో C లాంగ్వేజ్ బోధించే అధ్యాపకుడు ‘Fibbonacci series’ ప్రోగ్రాం పేపర్ నుండి content copy చేసి బోర్డు మీదకు paste చేసి నెక్స్ట్ పీరియడ్ leisure అని చెప్పి వెళ్ళిన తరువాత సీనియర్ అమ్మాయిల నుండి జూనియర్ అబ్బాయిలకు పరిచయాలకు ఆహ్హ్వానం వచ్చింది.
9 మంది సీనియర్ అమ్మాయిలకు same SD టేప్ రికార్డర్ లోని టేప్ 9సార్లు ప్లే చేసినట్టు 9సార్లు చెప్పాను. (టేప్ రికార్డర్ ప్రాస బాగుంటుంది అని వాడాను . మీ ఇష్టం రీప్లేస్ విత్ CD/డీవీడీ/Pendrive /HD..)
(ఇప్పుడు అనిపిస్తుంది బోర్డు దగ్గర నిలబడి 9 మంది అమ్మాయిలకు ఒకేసారి SD చెప్పి వుంటే సమయం వృధా కాకుండా వుండేది అని. సమయం వృధా ఐనా ఇంకొక లాభం ఉందండోయ్… )
సమయం అంటే గుర్తు కొచ్చింది 9 సార్లు SD అంతా కలిపి ఒకే పీరియడ్ లో 45 నిమిషాల కంటే తక్కువ సమయంలో నేను చెప్పడం జరిగినది . ఇంత తొందరగా అవడానికి కారణం
కారణం 1: నేను సీనియర్ అమ్మాయిని చూస్తూ వున్నాను అని వాళ్ళు ఫీల్ అయి తొందరగా ముగించేయడం
(అబ్బాయి తలదించుకొని మాట్లాడితే బాగుండదు కదండీ. కే. విశ్వనాథ్ సినిమా స్వర్ణ కమలంలో భానుప్రియ బాధ లాగ మనుసులో ఒకటి వుంటే బయటికి మరొకటి చేయడం కష్టం కదండీ. అర్థం చేసుకోరూ ఆబ్బాయిల ఇబ్బందులు….)
కారణం 2: ఈ బక్క జీవిని/ప్రాణిని ఎంత సేపు చూడడం అని వాళ్ళకి బోర్ కొట్టి తొందరగా స్టాప్ చేయడం.
తరువాత గాని నాకు తెలియలేదు మొదటిదే కారణం అని. (2వ కారణం కాదు అనడానికి సాక్ష్యం నాలాగే బక్కగా ఉండే మరొక జీవి చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలేనండి బాబూ.. )
ఆఫ్ కోర్స్, సీనియర్ అమ్మాయి జూనియర్ అబ్బాయిని ఎక్కువసేపు ర్యాగింగ్ చేసినట్లు చరిత్రలోఎక్కడ లేదని అనుకుంటున్నాను.
దానికి బలమైన కారణం ఉందండోయ్.
scenario 1: సీనియర్ అమ్మాయి – జూనియర్ అబ్బాయి (one side SD)
ఇక్కడ ఒక వైపు నుండే(జూనియర్ అబ్బాయి) పరిచయం. సీనియర్ అమ్మాయి నుండి నో డీటెయిల్స్. కనీసం పేరు కూడా చెప్పరు కొందరు. ఒక వేళ జూనియర్ అబ్బాయి మేడమ్ మీ పేరుచెప్పండి అంటే నువ్వే ప్రయత్నంచి నా పేరు తెలుసుకో అంటారు.
scenario 2: సీనియర్ అబ్బాయి – జూనియర్ అమ్మాయి (Both sides SD)
జూనియర్ అమ్మాయి అడగక పోయినా సీనియర్ అబ్బాయి యొక్కవిషయాలు అయస్కాంత బలం వలన ఆటోమేటిక్ గా బయటికి వచ్చే స్తాయి. పాపం ఆ అమ్మాయి ఇష్టం ఉన్న లేక పొయినా వినడం తప్పదు.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కాయలు ఉండే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ అన్నట్లు
అందంగా ఉండే జూనియర్ అబ్బాయిని, ప్రత్యేకంగా జూనియర్ అమ్మాయిని ర్యాగింగ్ ఎక్కువ సేపు చేస్తారు.
మీ ర్యాగింగ్ ఎంత సేపు జరిగిందో దానిని బట్టి మీరు ఇతరలకు అందంగా అనిపించారో లేదో తెలుస్తుంది.
Wait అలాగని ఫైన చెప్పిన లాజిక్ తో conclusion కు రావద్దు.
అందంగా ఉండే అమ్మాయితో ఒక సీనియర్ మాట్లాడుతూ వున్నడు అనుకుందాం.అంత త్వరగా వదలరు. ఇంకొక సీనియర్ ఖాళిగా ఉండకుండా అందమైన అమ్మాయితో మాట్లాడే అవకాశం వచ్చే వరకు, అందుబాటులో ఉండే అమ్మాయితోఅంత అందంగా లేక పోయినా ఎక్కువ సేపు మాట్లాడడం జరుగుతుంది.
ఇంకొక విషయం- ఒక వేళ సీనియర్ అమ్మాయి జూనియర్ అబ్బాయితో ఎక్కువ సేపు మాట్లాడుతూ వుంది అనుకో, ఆ అమ్మాయి అభిమానులు ఒక కన్నుఅటు వైపు వెసి, ఆ తర్వాత ఏమి మాట్లాడావ్ మేడంతో ఇంత సేపు, మేడం నీకు అంత బాగా నచ్చిందా అని అడుగుతారు. అది ఏదో సినిమాలోలాగా yes అంటే ఒక గొడవ, No అంటే ఒక గొడవ.
ఎంత సేపు ఈ theory మా కూడా తెలుసు. పాయింట్ కి రా వా(ఇది మీ మనసులోని మాట.కదూ…)
లాస్ట్ వాక్యం చెప్పి తర్వాత ట్రాక్ లోకి…
బొమ్మ్రరిల్లు సినిమాలో ప్రకాశ్ రాజ్ లాగా సీనియర్స్ గెలిచామని ఫీల్ అయ్యేవారు.కాని వారికీ తెలియలేదు ఫైన చెప్పినటువంటి గొడవలు ఏమి పెట్టుకోకుండా ఏమైనా బాధలు వుంటే మాలోనే వుంచుకొని/అణచుకుని చివరి వరకు సార్ సార్, మేడమ్,మేడమ్ అంటూ నవ్వు రాక పాయినా నవ్వతూ, మాలోని కొందరు మీలోని కొందరితో వీలయినప్పుడ్లా గ్లాసు, గాలి పంచుకొంటూ మా జూనియర్స్ మీ సీనియర్స్ ను గెలుపిస్తునే ఉండే వాళ్ళం.
(గమనిక: గాలి అంటే ఇక్కడ ధూమపానం. గ్లాసు అంటే… అరటి పండు వలిచి పెట్టినట్లు విడమరిచి చెప్పాలంటే పేజీలు/తరువాయిబాగాలు పెరిగిపోతాయి , అర్థం చేసుకోరూ… )
తరువాయి భాగం -5 కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులు-5 లో మళ్ళి కలుద్దాం. అంత వరకు సెలవు.
********************
—-రాజీ ప్రతాప్