X

కళాశాల తీపి గుర్తులు-6

*********************
ముందు భాగం  – కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులు-5
************************

సీనియర్స్ ఫ్రేషేర్స్ డే పార్టీ గిరీం పేట కళ్యాణ మండపంలో ఇచ్చేందుకు సన్నాహాలు చేసారు.
నేను మరికొందరు జూనియర్స్ తో కలిసి ఆటో లో కళ్యాణ మండపం దగ్గర దిగి లోపలికి వెళ్ళినాను. అందాలతో కళ్యాణ మండపం వెలిగి పోతున్నది.
అందాలు అంటే కళ్యాణ మండపం అంత బాగా అలంకరణతో వుంది అని మీరు అనుకుంటే పొరపాటు.

ఒకరా, ఇద్దరా 18 అమ్మాయిలు సంప్రదాయ దుస్తులైన చీరలను దరించి ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క  లాగా , వాళ్ళ శోభతో కళ్యాణ మండపం ఓ వెలుగు వెలుగి పోతున్నది.

ఐనా రెండు కన్నులు మా దృష్టి అంతా అమ్మాయిలను చూడడం వరకే అని చూపు పక్కకు తిప్పటానికి ప్రయత్నించిన నసేమిరా అని సహకరించికపోతే ఏమి చేస్తాం ! eyes were out of control on that time.

 

ఇలా చెప్పడం అమ్మాయిలను ఎగతాళి చేయడం కాదు. ఇది కచ్చితంగా పొగడత.

సందర్బం వచ్చినది కాబట్టి ఈ భాగంలో స్రీల గురించి చెప్పాలని అనుకుంటున్నాను.

 

నేను BT కాలేజీలో డిగ్రీ చదివినా రోజులలో “సమాజంలో స్రీల పాత్ర” (The role of the women in the society) అనే టాపిక్ ఫై జరిగిన ఉపన్యాసంలో నేను చెప్పిన, నాకు ఇప్పుడు గుర్తు వున్న కొన్ని వాక్కాలు మీ కోసం.


స్తన్యం ఇచ్చి పెంచి పోషించిన అమ్మ కన్నా ప్రేమమయి లేదన్నారు అందుకే మాతృ దేవో భవ అని కీర్తించారు.

 

ఊయలను ఊపే చేయి ఊర్విని కూడా పరిపాలించాగలమని శ్రీమతి ఇంద్రాగాంధీ, సిరిమవో బండరా నాయక్ వంటి వారు నిరూపించారు.

 

చందమామ రావే జాబిల్లి రావే అని పాడుతూ చిన్న పిల్లలకు గోరుముద్దలు పెట్టడమే కాదు చందమామ వద్దకు కూడా వెళ్ళగలమని కల్పనాచావ్లా వంటి వారు నిరూపించారు.

 

స్రీలు అన్ని రంగాలలో ప్రావీణ్యంతో రాణించటం చూసి అందుకే ఒక సినిమా కవి “లేచింది మహిళా లోకం నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రంపచం ” అని అన్నాడు.

 

అమ్మ మనసు !
భార్య అభిమానం !
వదిన వాత్సల్యం !
మరదలి సరసం !
ఆడబిడ్డ విరసం !
చెల్లి అనురాగం !
అక్క ఆప్యాయత !
కూతురి మమకారం !
కోడలి కొంటెతనం !
అమ్మమ్మ ఆందోళన !
నాయనమ్మ నమ్మకం !
అత్తయ్య ఆతృత !
పెద్దమ్మ ప్రేమ !
పిన్ని పెదసరితనం !

……

……
అబ్బో రాసుకుపోతే రామాయణ కావ్యం అవుతుంది స్రీ హృదయం.

 

సముద్రపు లోతు తెలుసుకోగల చాతుర్యం శాస్రజ్ఞలకు వుంది. సముద్రంలో చరిస్తున్న జల రాశులను విశ్లేషించి చెప్పగల శక్తి వైజ్ఞనికులకు వుంది.
కానీ స్రీ హృదయపు లోతు తెలుసుకోగల శక్తి శాస్రజ్ఞలకు, మేధావులకు, కవులకు, పండితులకు, విమర్శకులకు ఎవ్వరికి లేదు.

 

అందుకే నువ్వు శక్తి స్వరూపిణిమమ్మా అని చెప్పి “ఆదిశక్తి” అని పేరు పెట్టి అర్చనలు చేస్తున్నాడు మగవాడు.

 

సముద్రంలో కదిలే జీవరాశిని తెలుసుకోగలిగనా, స్రీ హృదయంలో మెదిలే భావరాశిని తెలుసుకోలేక పోతున్నారు.

—-
కొన్ని వాక్యాలు ఎప్పుడో చదివిన పరుచూరి బ్రదర్స్ రాసిన ఒక నవల లోనివి.

 

ఈ భాగాన్నిమన జీవితంలోని అందరి స్రీలకు (అమ్మకు, అమ్మమ్మకు, భార్యకు,…… ) అంకితం.
——
తరువాయి భాగం -7 లో మళ్ళి కలుద్దాం. అంత వరకు సెలవు.

********************
—-రాజీ ప్రతాప్

Categories: Uncategorized
Prathap Reddy:
Related Post