నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు3

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

రెండువేల పందొమ్మిది వదిలింది భారమై
కొత్త ఆశలతో కదిలింది రెండువేల ఇరువై

ఆరంభ అడుగుతో ప్రారంభమై
జనవరి ఒకటి తెరిచింది ఏడాదికి ద్వారమై
పలికింది స్వాగతాలతో పూలహారమై
కొత్త అధ్యాయానికి శ్రీకారమై

ఆశలు ఆశయాలు నెరవేరాలి వరమై
సుఖ సంతోషాల జీవనసమరమై
గడిచే ప్రతి క్షణం మదిలో మధురమై

మీకు మీకుటుంబ సభ్యులకు మనసారా
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

AddThis Website Tools
Prathap Reddy:
Related Post