అట్టడుగు స్థాయికి దిగజారినా, అతి ఉన్నత స్థాయికి ఎదిగినా,
ప్రతక్ష్యంగా లేదా పరోక్షంగా జీవిత భాగస్వామి అందించే సహాయ సహకారాలే కారణం.
భర్తలో భార్య సగ భాగం అని అర్థాంగిగా ఆహ్హ్వానించిన,
తన మొత్తం జీవితాన్నిఆర్పంచి, అంకితం చేసే పూర్ణాంగిగా మారి
ఏడు అడుగులతోమొదలు పెట్టి జీవితమనే మజిలీలో కడవరకు నీతో పాటు,
నీ మార్గంలో నడిచే ఏకైక ప్రియాతి ప్రియ నేస్తం జీవితంలోకి అడుగు పెట్టిన
ఆ అరుదైన మధుర క్షణంను మననం చేసుకునే
మీ పెళ్లి రోజు కు నా హృదయ పూర్వక అభినందన మందార మాల.
అపార్థం అనే అంతరాలను అధిరోహిస్తూ,
అనుమానాలకు అవకాశం ఇవ్వకుండా,
అవసరమైనప్పుడు ఆత్మ పరిశీలనతో,
ఆగ్రహాలను అనుచుకుంటూ,
అనురాగాలను పెంచుకుంటూ,
అనందాలను ఆస్వాదిస్తూ,
ఆప్యాయతలతో అల్లుకుపోతూ,
అంతు లేని అనుభూతులతో,
ఆదర్శంగా, అన్యోననంగా
వుండాలని ఆకాంక్షిస్తూ
మునుపెన్నేడు చేయని ఒక మంచి పని ఆలోచించి మీ పెళ్లి రోజు గుర్తుగా ఆరంబించి, ఆచరిస్తారని ఆశిస్తూ
మరిఒక సారి పెళ్లి రోజు శుభాకాంక్షలతో,
–రాజీప్రతాప్
********************************************