X

పుట్టిన రోజు శుభాకాంక్షలు-1

పుట్టిన రోజు జరుపుకుంటున్న మా సోదరునికి తెలిపిన శుభాకాంక్షలు కవిత మీ కోసం
*****************
కదలి పోయే కాల ప్రవాహంలో
కార్తీకం కరిగిపోయి మార్గశిరం మొదలై
మరో వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణమైన నేటి
నీ పుట్టిన రోజుకు స్వాగతం సుస్వాగతం

రాబోయే రోజులన్నీ మధురమైన మరపురాని మైమరపించే రోజులు కావాలి అని
నవ్వులతో నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకొంటూ

ఆతృతకు అడ్డుకట్ట వేసి
ఆవేశాన్ని అణుచుకొని

వేసే ప్రతి అడుగు ,
గడిపే ప్రతి ఘడియ,
పలికే ప్రతి పలుకు ,
చేసే ప్రతి చర్య
ఆలోచన అనే ఆయుధంతో ఆరంభించాలని ఆశిస్తూ

ఆరోగ్యాన్ని ,ఐశ్వర్యాన్ని ఆధీనంలో ఉంచుకొని
అమూల్యమైన క్షణాలను అధికంగా మా అందరితో పంచుకోవాలి.

అదే మా అందరి ఆకాంక్ష
ఇదే మేము నీకు అందించే జన్మదిన శుభాకాంక్ష

–రాజీప్రతాప్
********************************************

Prathap Reddy:
Related Post