X

సంక్రాంతి శుభాకాంక్షలు

భోగి, సంక్రాంతి , కనుమ శుభాకాంక్షలు
*********************************************************

పుష్యమాసం – హేమంతం – ఉత్తరాయణ ఆరంభ శుభతరుణం
మకర సంక్రమణం – మనకు సంక్రాతి సంబరం

చలిరాత్రి చీకట్లను తొలగిస్తూ పాతవస్తువులతో వేసే వెచ్చని వెలుగునిచ్చే
భోగిమంటలతో స్వాగతమిచ్చే ఉషోదయం

సాయంకాలాన బొమ్మల కొలువులతో,
బుజ్జాయిలను భోగిపండ్లతో చేసే దీవెనలతో భోగి ఘట్టం సమాప్తం

మామిడి తోరణాలతో వాకిళ్లు
రంగు రంగుల ముగ్గులతో ముంగిళ్లు
గుమ్మడిపూలు గుచ్చిన గొబ్బిళ్లు
కొంటి సరసాలతో బావా మరదళ్లు

గొబ్బెయాలు గొబ్బెయాలు అనే గానంతో గడుసరి భామలు
గంగిరెద్దు మెడగంటల సవ్వడులు డోలు సన్నాయి రాగాలు
పంచె కట్టుకొని అక్షయపాత్ర నెత్తిన పెట్టుకొని
హరిలో రంగ హరి అని పాడే హరిదాసు సంకీర్తనలు

కొత్త పంటలతో పిండివంటలతో ఇంటింటా సంతోషాల పండుగగా
పాడి పశువుల పూజలు, ఊరేగింపులతో కనుమ కనువిందు చేయగా

గాలిపటాలు, కోలాటాలు, కోడిపందాలు …
ఇంకా ఎన్నో ఎన్నోన్నో సంక్రాంతి సంబరాల సంగతులు
మన సంప్రాదాయాలకు ప్రతీకలు

ఆచారాలు మరచి సంప్రాదాయాలు కనుమరుగవుతూ
పండుగలను మందు విందుల వినోదాలుగా మార్చివేస్తున్న తరుణంలో
సంసృతి సంప్రాదాయాలను పాటిస్తూ బావితరాలకు కొనసాగింపుగా అందించాలని ఆశిస్తూ

భోగి, సంక్రాంతి , కనుమ శుభాకాంక్షలతో

—రాజీప్రతాప్
*********************************************************

Prathap Reddy:
Related Post