X

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు
**********************************

విధిగా వచ్చిన వినాయక చవితి
వీధిలో వెలసిన మహాగణపతి
వీక్షించే వారికి కలుగును దివ్యమధురానుభూతి

వెన్నెల రాత్రిని తలపించే విద్యుత్ జ్యోతులు విరజిల్లే కాంతి
వినోదాలు,విన్యాసాలతో నిండు సందడి ఈ రాత్రి

నిమజ్జనం పేరుతో వికటిస్తున్న సంస్కృతి
పరుగులెత్తి పెరుగుతున్న కాలుష్య దుస్థితి
ఈ పరిస్థితికి చరమగీతం పలకమని జగతిని వేడుకుంటున్న ప్రకృతి

వీరు వారు అనే బేధములను మరచి
వ్యధలను , వేదనలను వదిలించి
విర్రవీగిన విఘ్నాలను విదిలించి

ఘడియ ఘడియ ఘనంగా గమనాన్ని గమ్యం వైపు నడిపించి
విడదీయలేని విలువైన విజయాలతో జీవితాన్ని వికసింప చేయాలని
వినాయకునికి విన్నవిస్తూ

మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలతో
===============================
—–రాజీ ప్రతాప్

Prathap Reddy:

View Comments (1)

Related Post