సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి శుభాకాంక్షలు
===========================
హేమంతపు హిమంను కరిగించి
సమస్త తిమిరాలను హరించే భోగిమంటల కాంతి
కలిగించెను వైభోగాలతో పసిడి సిరుల కాంతి

అంబరాన్ని అంటే సంబరాల నవ్య కాంతి సంక్రాంతి
ఒకే చోటికి చేరిన హితులు, సన్నిహితుల మాటామంతి
అంతరంగంలోని అగాధాలు అన్ని ఆవిరి చేసి
గుర్తు చేసింది అనురాగాలు, అనుబంధాల సంగతి

దివికేగిన పెద్దల దీవెనల కొరకు మంగళ హారతి
బుజ్జాయిలను బోగి పండ్లతో దీవించే మాతృమూర్తుల అనుభూతి

రైతుల స్వప్నాలకు సారధులు అయిన పాడి పశువులకు విశ్రాంతి
పూజలు, ఊరేగింపులతో కనువిందు చేసే కనుమ సంస్కృతి

ఇంకా ఎన్నో ఎన్నెన్నో సంక్రాంతి సంబరాలు స్రవంతి
రైతన్నలు మనకందరికీ అందించే అమూల్య బహుమతి

కాలుష్యం పెరిగి కన్నెర్ర చేస్తున్న ప్రకృతి
వానజల్లు లేక కన్నీటిజల్లు పెరుగుతున్న పరిస్థితి
అహర్నిశలు అలుపెరగక శ్రమించే అన్నదాతకు దిక్కుతోచని స్థితి

దాహం తీర్చే నీటి కోసం వేసే బోర్లతో బోరుమంటున్న ధరిత్రి
ఇదే నీటి వెలితి కొనసాగితే అవుతుంది మనిషి గతి మండుతున్న చితి

వ్యర్థం కాకూడదు ప్రతి నీటి బిందువు, ప్రతి మెతుకు. జాగ్రత్త పడాలి జగతి.
లేకపోతే అవుతుంది మన ప్రగతి అధోగతి.

మరొకసారి భోగి,సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలతో

—మీ రాజీప్రతాప్

1 thought on “సంక్రాంతి శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *