ప్రియురాలు అదృశ్యమైతే

===============================
అకస్మాత్తుగా మీ ప్రియురాలు అదృశ్యమై
ఓ పువ్వుగా మారిపోతే మీరు ఎలా కనుక్కుంటారు
==========================================

********************************************
ఆలస్యం చేయకుండా కథ ఆరంభిస్తే కథల్లో మన కథానాయకుడు అమ్మాయిలకు ఆమడ దూరం
కాదు కాదు. అమ్మాయిలే తనకి ఆమడ దూరం
ఎందుకంటే ఇతను ఏమి ఆరడుగుల ఆజానుబాహుడు కాదు
సాదా సీదా మధ్యతరగతి మనిషి
అందంలో కానీ ఐశ్వర్యం లో కానీ సగటు “మని”షి

ప్రతి మనిషికి రాసినట్లే ఇతని నుదుట రాశాడు ఆ బ్రహ్మ రాత
ఆ రాతలో ఓ అమ్మాయి అవుతుంది అతనికి జత
అని అతని నుదుట గీశాడు ఓ గీత
ఆ గీతలో ఉన్నట్లు
ఒక రోజు ఒక చక్కనైన చుక్కలాంటి అమ్మాయి హఠాత్తుగా వచ్చి
తన ప్రేమను వ్యక్తపరిచింది

ఇది కలయో నిజమో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఊపిరి పీల్చుకోవడం మరిచి
“నాకొక ప్రేయసి దొరికింది” అని ఎగిరి గంతు వేయాలనే అందలమెక్కిన ఆనందాన్ని అనుచుకుంటూ
నోటి నుండి మాట రాక “ఊ ” అని ఊకొడుతూ తన అంగీకారాన్ని తెలిపి
ఆ అమ్మాయి ని అనుసరిస్తూ ఆ అమ్మాయి మాటలను ఆలకిస్తూ “అంతేగా అంతేగా” అని ఆచరిస్తూ
ప్రేమ రహదారిలో సాగిపోతోంది వారి ప్రయాణం….. పరిణయం అనే గమ్యం వైపు అలా అలా….

చాలా ప్రేమ కథల్లో మాదిరిగా వీరి పెళ్లికి పెద్దల రూపంలో ఆటంకం ఎదురైంది.
ఒక ఆప్త మిత్రుడు ఇచ్చిన సలహాతో ఈ ఆటంకాలను తొలగించుకోవడానికి అమ్మవారికి అర్చన చేయాలని ఒకరోజు అమ్మవారి గుడికి వెళ్లారు.

గుడి లోపల అమ్మవారిని ఆరాధిస్తూ అర్చన చేస్తుండగా,
అమ్మవారు వీరి ఆలాపనను ఆలకించి, అనుగ్రహించి
ఆకాశంలోని మేఘాల రూపంలో చిరుజల్లు లను అక్షింతలుగా జల్లి ఆశీర్వదించింది.
వీరు గుడిలో లోపలి ఉండగా ఓ ఐదు నిమిషాలు వర్షం పడి ఆగిపోయింది.
పూజ అయిన తర్వాత గుడి గంటను మూడు సార్లు మ్రోగించి తన ప్రియురాలు ను క్రీ గంటతో చూస్తూ ఏదో ఆలోచనలో ఉండగా
ఆ అమ్మాయి అతని కంటే ముందుగా బయటికి వచ్చి ఆ ఆహ్లాద వాతావరణంలో
గుడి ఆవరణలో ఉన్న ఓ పూల చెట్టు దగ్గరికి వెళ్లి ఒక పువ్వుల చెట్టు దగ్గరికి వెళ్లి
ముద్దుగా ముచ్చటగా ఉన్న ముద్దమందారం పువ్వు కు ముగ్దురాలై
ఓ పువ్వును కోసి తలలో పెట్టుకోగానే ఆ అమ్మాయి హఠాత్తుగా అదృశ్యమై ఆ చెట్టుకి ఒక పువ్వుగా మారిపోయింది.
కోసిన పువ్వు చెట్టులోని యథాస్థానంలోకి వచ్చేసింది.
ఆ చెట్టుకి 7 పువ్వులు ఉండగా ఈమె ఎనిమిదో పువ్వుగా అయ్యింది.

ఇంతలో మన కథానాయకుడు గుడి బయటకు వచ్చి ప్రేయసి కోసం వెతకగా ఆమె కనపడకపోవడంతో ఆందోళనతో
ఆ జగన్మాతను ఈ విధముగా వేడుకున్నాడు

జనని శివకామిని విజయ రూపిణి
అమ్మలు గన్న అమ్మవు నీవే
అఖిల జగాలకు అమ్మవు నీవే
నీ దరినున్న తొలగు భయాలు
నీ దయ ఉన్న కలుగు జయాలు
జనని శివకామిని విజయ రూపిణి

అని ప్రార్థించగా ఆ అమ్మవారు ఆకాశవాణి రూపంలో
“భక్తా, ‘ఈ చెట్టు లోని పూలు ఈ గుడిలోని దేవతకే అంకితం’ అనే ప్రకటనను చూడకుండా పువ్వును కోయడం వలన నీ ప్రియురాలు ఆ చెట్టుకి ఒక పువ్వుగా మారిపోయింది.
ఆమె ఆయుష్షు తీరిపోయింది” అని చెప్పగా

ఎలాగైనా తన ప్రేయసిని బతికించమని కోరగా
అందుకు కొన్ని నియమాలకు అంగీకరిస్తే సహాయం చేయగలను అని చెప్పింది
అతడు ఆ నియమాలు ఏమిటి అని అడగగా

మొదటి నియమం ఏమిటి అంటే
“ఈ 8 పువ్వులలో నీ ప్రియురాలు పువ్వుగా మారిన పువ్వును గుర్తించి ఆ పువ్వును రెండు చేతుల్లో తీసుకుని మనస్ఫూర్తిగా ముద్దాడితే దానిని నేను గాంధర్వ వివాహం గా పరిగణించి ఆమె నీ అర్ధాంగి అవుతుంది కాబట్టి నీ మిగిలిన ఆయుష్షులో అర్ధ ఆయుష్షుును ఆమెకు ఇచ్చి బ్రతికించగలను”

రెండవ నియమం ఏమిటంటే
“ఆ పువ్వును మొదటి పది సెకన్లలో గుర్తిస్తే మిగిలిన పువ్వులను కూడా ఈ పువ్వు తో పాటుగ నీకు బహుమతిగా ఇస్తాను
అలా కాకుండా పది సెకనులు 20 సెకనులు మధ్యకాలంలో పువ్వును గుర్తిస్తే నీ ప్రియురాలు మాత్రమే ఇస్తాను
20 సెకనుల తర్వాత కూడా గుర్తించ లేకపోతే నువ్వు కూడా ఆ చెట్టుకు ఒక ఆకుగా అయిపోతావు.”

ఈ నియమాలకు అతను అంగీకరించి 10 సెకన్లు 20 సెకండ్ల మధ్యకాలంలో తన ప్రేయసిని గుర్తించాడు.

అప్పుడు ఆకాశవాణి “నీవు 10 సెకనుల లోపే గుర్తించగలిగే వాడివి కానీ ఎందుకో నీవు 10 సెకండ్లు కంటే ఎక్కువ సమయం తీసుకున్నావు.
దీనిలోని మర్మమేమిటో తెలుసుకోవచ్చా.”
అని అడగగా

అతడు “తల్లి ఒకవేళ నేను పది సెకండ్లలోపే నా ప్రేయసిని గుర్తించినట్లయితే మిగతా పువ్వులను కూడా నీవు నాకు బహూకరిస్తే మొత్తం నాకు ఎనిమిది మంది ప్రియురాలు అవుతారు. శ్రీకృష్ణ భగవానుడు అంతటివాడే తన ఎనిమిది మంది భార్యలతో సంసారాన్ని ఈదలేక కష్టాలు పడ్డాడు సామాన్య మానవుడు అయినా నేను అందునా మధ్యతరగతి మనిషిని వారు అడిగే కోర్కెలను ఎలా తీర్చగలను, ఎనిమిది మందితో ఎలా సంసార యాత్ర సాగించగలను.”

ఇంతలో ఆకాశవాణి అతని సమాధానానికి సంతోష పడి
“భక్తా ఇదంతా నేను నీకు పెట్టిన ప్రేమ పరీక్ష. ఈ పరీక్షలో నీవు 100% తో ఉత్తీర్ణుడయ్యాడు కాబట్టి మీ ఇద్దరికీ వందేళ్లు ఆయుష్షుని ప్రసాదిస్తున్నాను అలాగే మీ పెద్దల ఆలోచనలను మార్చి మీ పెళ్ళికి ఒప్పుకునే టట్లు చేస్తాను. నీ ప్రియురాలికి ఎప్పుడు వాడిపోని ఎల్లకాలం సువాసనలు వెదజల్లే ఒక పువ్వును బహుమతిగా ఇస్తున్నాను దీనికి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఒకరోజు చామంతిలా ఇంకొకరోజు ముద్దబంతిలా ఇంకొకరోజు ముద్దమందారంలా ఇలా రకరకాల పువ్వులుగా మారుతూ ఉంటుంది అని చెప్పి ఆకాశం నుండి ఒక తార ని తీసి పువ్వుగా మార్చి అమ్మాయి తలలోకి వేసింది.”
ఇలా వాళ్ల ప్రేమ కథ సుఖాంతమయింది.

మనం ఇంకొంచెం ముందుకు పోతే
ఈ ప్రేమ కథలో మన కథానాయకుడు 8 పువ్వులలో తన ప్రేయసి పువ్వు గా మారిన పువ్వును ఎలా కనుక్కున్నాడు.

ఒక గమనిక ఇక్కడ 7 పువ్వులు, మరొక అమ్మాయి వాళ్లలాగే పువ్వుగా మారినందుకు ( “ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువు. అసూయ పుట్టి తర్వాత ఆడవాళ్లు పుట్టారు “అనడానికి ఒక ఉదాహరణగా)సంతోషంతో నవ్వుతూ వికసించుచుండగా,
ప్రియుని వదిలి పువ్వుగా మారినందుకు బాధపడుతూ వాడిపోయిన పువ్వు గా ఉందని భావించి ఈ వాడిన పువ్వే ప్రియురాలు అని గుర్తించాడని అతిగా ఊహించుకోకండి ఇక్కడ అన్ని పూలు ఓకే విధముగా ఉన్నాయి.

సమాధానం వీడియో లో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *