కళాశాల తీపి గుర్తులు-1

కళాశాల తీపి గుర్తులు -1 (మొదటి భాగం)
*****************************************

గుర్తుకొస్తున్నాయి ….నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ..ఈనాటికి….
జబర్దస్త్ స్కిట్స్ చూసినప్పుడు చాలా సార్లు మా MCA ఫ్రెషర్స్ డే పార్టీ స్కిట్ గుర్తు కొచ్చేది.
16 సంవత్సరాల ముందుటి ఙ్ఘాపకం – మా MCA స్నేహితుల అందరి కోసం ఆ స్క్రిప్ట్ రాసి అందరికి పంపితే ఎలా ఉంటుంది అనే చిలిపి ఆలోచన వచ్చినది. దాని ఫలితమే నా మెదడు పొరలలో నుంచి అక్షర రూపంలోకి
పెళ్లి గోల నాటకం
ఫ్రెషర్స్ డే పార్టీ ఓ తీపి గుర్తు.

******************************************
ఎవరిని కించ పరచడానికి వ్రాయడం లేదు. కాలక్షేపం కొరకు . ఆనందించండి లేదా చదవడం ఆపేయండి. కొన్ని చోట్ల ద్వంద అర్థాలతో మీరు ఆలోచన చేసితే అది నా తప్పు కాదు.

మొదట భాగం -సీనియర్స్ – జూనియర్స్ పరిచయాలతో మొదలు పెట్టి తరవాత భాగంలో డ్రామా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాను.
ఇరువరం దగ్గర కల్యాణ మంటపంలో మొదటి సెమిస్టరు క్లాస్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సీనియర్స్ జూనియర్స్ పరిచయ కార్యక్రమంలో భాగంగా సైకిల్ మీద ఇరువరంలోని ఒక సీనియర్ రూంకి వెళ్ళినాను.

వాళ్ళ రూంలోని కంప్యూటర్లో నువ్వే కావాలి సినిమాలోని పాటలు వస్తున్నాయి (చిత్తూర్ రాఘవ థియేటర్లో నువ్వే కావాలి సినిమా ఆడే రోజులు).
అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టాయ్యింది
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

నువ్వే రావాలి అని ఒక సీనియర్ వచ్చి నన్ను రూంలోకి తీసుకునివెళ్ళాడు హాల్ లో నుంచి.
SD చెప్పమన్నాడు SD అంటే మీకందరికీ తెలుసు ఎందుకంటే మీరందరు కూడ SD చెప్పిన వాళ్లే కాబట్టి..
తర్వాత ఏ దైన ఒక పాట పాడమనాడు. నాకు పాటలు రావు సార్ అన్నాను
పర్వాలేదు ఎదో ఒక పాట పాడాలి అన్నారు. నో ఆప్షన్
పాపం ..మంచి పాట ఏక్సపెక్ట్ చేసినాడు
కానీ నేను పాడినా పాట .

###################################

జనని శివ కామిని జయ సుభ కారిణి విజయ రూపిని
జనని శివకామిని

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మలగన్న అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితి నమ్మ
శరణము కోరితి అమ్మ భవానీ..
నీ దరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగా నిలిచి
జయము నీయవే అమ్మ..
జయము నీయవే అమ్మ భవాని…….

##################################

అమాయకుడిని నేను ఇంతకంటే మంచి పాట ఎలా పాడగలను చెప్పండి
తర్వాత జూనియర్స్ ని ఎవరిని పాట పాడమని అడగలేదు.

తర్వాత ఐశ్వర్య రాయ్ కి సౌందర్యా కి గల తేడా క్షుణముగా విపులీకరించి చెప్పమని అడిగారు.
సౌందర్య జుట్టు నల్లగా ఉంటుంది – ఐశ్వర్య రాయ్ జుట్టు లైట్ గోల్డెన్ బ్రౌనుగా ఉంటుంది.
సౌందర్య ముఖం గుండుగా ఉంటుంది – ఐశ్వర్య రాయ్ ముఖం కోసుగా ఉంటుంది.
సౌందర్య కళ్ళు…. – ఐశ్వర్య రాయ్ కళ్ళు….
……
…….
ఏదో ఆలా చెప్పేసాను

తరవాత ఇంకొక సీనియర్ బయట బండ మీద కూర్చుని వున్నాడు. అక్కడికి పిలిచారు .
దట్టమైన పొగ మధ్యలో రింగులు రింగులుగా (ఇల్లు కాలిపోతున్నది అని అనుకోవద్దు)
అది ధూమపానం వలన వచ్చేది. SD చెప్పమన్నాడు
సార్ సిగరేట్ పొగ పట్టదు అన్నాను. నా కోసం ఆపేసాడు .
మిగిలిన హాఫ్ సిగరెట్ నా వైపు థాంక్స్ అన్నట్టు చూసినట్టు అనిపించింది . దాని అర్ధ జీవితాన్ని కాపాడినందుకు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
–రాజీప్రతాప్
********************************************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *