X

పుంగనూరు బసవరాజ జూనియర్ కళాశాల జ్ఞాపకం

==============

ఆనందమయమైన ఆనాటి విద్యార్థి జీవితం
మధురమైన జ్ఞాపకంగా మదిలో సుస్థిరం

పల్లెల నుండి కళాశాలకు వచ్చే విద్యార్థులకు సేదదీర్చే చిరునామాలు
కళాశాల వెనుక ఉన్న దేవాలయాలు

పరమశివుని ప్రాకారములో
పరిమళించే పున్నాగలు
వేయి వేల్పుల వెంకటేశ్వరుని వేద మంత్రములు

ఓంకార నాదం వినపడే ప్రాకారంలో స్నేహానికి శ్రీకారం
కోనేటి మెట్లమీద నేస్తాల చిరునవ్వులు

ఖాళీ సమయం దొరికితే గడిపిన గంటల గంటలు
పోటీపడి మ్రోగే రెండు గుడి గంటల మ్రోతలు

ఆకలైతే కట్టమీద హోటల్లో కొనుక్కున్న కాళీ దోసెలు
కడుపు నిండి ఖాళీ అయిన జోబులు

వానలు పడితే కోనేటిలో ఇంకిపోయిన నీళ్లు తిరిగి వస్తాయేమో కానీ
కాలంతో కలిసిపోయిన మనం అక్కడ గడిపిన క్షణాలు మాత్రం తిరిగి రావు రాలేవు

బతుకు బండి లాగడానికి బయలుదేరాము బెంగళూరు
మన పూలబాటకు పునాది వేసిన పుంగనూరు జోహార్లు


మీ
రాజీప్రతాప్

Prathap Reddy:
Related Post