పుట్టిన రోజు శుభాకాంక్షలు-4

నిరాశ ,నిస్ప్ర హ ,నిర్లక్ష్యం లను నీ దరిచేరకుండా
నిరంతరం నిశ్చలమైన నిర్మలమైన ఆలోచనలతో ,
నిశ్శబ్దా భావాల్ని సవరిస్తూ ,

సస్నేహ వీచికల సౌరభాల్ని పరిరక్షించుకుంటూ మాతో పంచుకుంటూ ,
కాలం అనే కల్పవృక్షము ను నీ సంకల్పాలను తీర్చుకునేందుకు కాలంతో కలసి పయనించి

ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలను తీసుకుని
నీ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకుంటూ

నీ ఆశలను, ఆశయాలను సాదిస్తావని ఆకాంక్షిస్తూ
చిన్ని చిన్ని ఆశలతో
చీకు చింతలను ఛేదిస్తూ
చిరు చిరు నవ్వులు చిందిస్తూ
చిరకాలం చిరంజీవిగా బతకాలని మనసారా ఆశీస్తూ మరియొక సారి జన్మ దిన శుభాకాంక్షలతో
నీ నేస్తం

–రాజీప్రతాప్
********************************************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *