===================== దీపావళి దీపపు కాంతుల వెలుగుల ఆవళి ఇంటి లోగిళ్లలో ప్రమిదల వెలుగుల రంగేళి కంటి ప్రమిదలలో ఆనంద కాంతులకేళి తారాజువ్వల పువ్వులతో చిన్నారుల కేరింతలతో కథాకళి సకల జనావళికి కావాలి ఈ దీపావళి సంపదలిచ్చే సర్వ శుభావళి చెయ్యాలి మనసులో బాధలు ఖాళీ తీర్చాలి మన జీవిత ఆశావళి మరొకసారి దీపావళి శుభాకాంక్షలతో — మీ రాజీప్రతాప్
Tag: deepavali subhakankshalu
దీపావళి శుభాకాంక్షలు ======================= దీపాలంకృతమై వెలిగే మీ గృహాళి మీ ఇంట ఘల్లు ఘల్లుమనే శ్రీ లక్ష్మి అందెల రవళి దేవదేవుని దీవెనలతో చేకూర్చు భాగ్యాళి నిత్య నూతన కాంతులు విరజిమ్ముతూ వచ్చిన ఈనాటి దీపావళి చామంతులతో చెట్టాపట్టాలు వేసుకొన్న ద్వారాల పచ్చ తోరణాలు లతల్లా దేహానికి అల్లుకుపోయిన నూతన దుస్తులు ఉల్లాసం ఉత్సాహంతో ఉరికే పసిపిల్లలు మంత్రాలు , మంగళ హారతులతో కూడిన దీవెనలు అపశృతులు జరగకుండా మురిపెంగా […]