నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండువేల పందొమ్మిది వదిలింది భారమై కొత్త ఆశలతో కదిలింది రెండువేల ఇరువై ఆరంభ అడుగుతో ప్రారంభమై జనవరి ఒకటి తెరిచింది ఏడాదికి ద్వారమై పలికింది స్వాగతాలతో పూలహారమై కొత్త అధ్యాయానికి శ్రీకారమై ఆశలు ఆశయాలు నెరవేరాలి వరమై సుఖ సంతోషాల జీవనసమరమై గడిచే ప్రతి క్షణం మదిలో మధురమై మీకు మీకుటుంబ సభ్యులకు మనసారా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
Tag: telugu kavithalu
=============================== అకస్మాత్తుగా మీ ప్రియురాలు అదృశ్యమై ఓ పువ్వుగా మారిపోతే మీరు ఎలా కనుక్కుంటారు ========================================== ******************************************** ఆలస్యం చేయకుండా కథ ఆరంభిస్తే కథల్లో మన కథానాయకుడు అమ్మాయిలకు ఆమడ దూరం కాదు కాదు. అమ్మాయిలే తనకి ఆమడ దూరం ఎందుకంటే ఇతను ఏమి ఆరడుగుల ఆజానుబాహుడు కాదు సాదా సీదా మధ్యతరగతి మనిషి అందంలో కానీ ఐశ్వర్యం లో కానీ సగటు “మని”షి ప్రతి మనిషికి రాసినట్లే ఇతని […]
===================== దీపావళి దీపపు కాంతుల వెలుగుల ఆవళి ఇంటి లోగిళ్లలో ప్రమిదల వెలుగుల రంగేళి కంటి ప్రమిదలలో ఆనంద కాంతులకేళి తారాజువ్వల పువ్వులతో చిన్నారుల కేరింతలతో కథాకళి సకల జనావళికి కావాలి ఈ దీపావళి సంపదలిచ్చే సర్వ శుభావళి చెయ్యాలి మనసులో బాధలు ఖాళీ తీర్చాలి మన జీవిత ఆశావళి మరొకసారి దీపావళి శుభాకాంక్షలతో — మీ రాజీప్రతాప్
వినాయక చవితి సందర్భంగా మా అపార్ట్మెంట్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని నేను చేసిన కార్యక్రమం “జాబిలి కోసం జాగారం” మీకోసం. ============ మీ అందరికీ నా నమస్కారాలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. నమస్కారంతో పాటు సంస్కారాన్ని నేర్పిన నా తల్లిదండ్రులకు, గురువులకు, బంధుమిత్రులకు నా కృతజ్ఞతలు. నన్ను ముందుకు నెట్టి నా ప్రదర్శన ఎలా ఉంటుందో అని ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి స్టేజి మీద కాలు పెట్టి […]
చినుకు పడక పంట పండక కడుపు నిండక పగలనకా రేయనక నిలువ నీడ లేక దిక్కుతోచక దారి తెలియక జీవిత నౌక ముందుకు సాగక రైతు చావు కేక
============== ఆనందమయమైన ఆనాటి విద్యార్థి జీవితం మధురమైన జ్ఞాపకంగా మదిలో సుస్థిరం పల్లెల నుండి కళాశాలకు వచ్చే విద్యార్థులకు సేదదీర్చే చిరునామాలు కళాశాల వెనుక ఉన్న దేవాలయాలు పరమశివుని ప్రాకారములో పరిమళించే పున్నాగలు వేయి వేల్పుల వెంకటేశ్వరుని వేద మంత్రములు ఓంకార నాదం వినపడే ప్రాకారంలో స్నేహానికి శ్రీకారం కోనేటి మెట్లమీద నేస్తాల చిరునవ్వులు ఖాళీ సమయం దొరికితే గడిపిన గంటల గంటలు పోటీపడి మ్రోగే రెండు గుడి గంటల […]
================ క్రమంగా కరువవుతున్న కొమ్మ మీద కోయిలమ్మ కూత మరుగవుతున్న మనసును మురిపించే సువాసనలను విరజల్లే జాజిమల్లి పూత వేసవి తాపంతో పెరిగిన ఉక్కపోత భూగర్భ జలాల తగ్గుదలతో నీటి సరఫరాలో కోత నాటాలి వృక్షాలను పరిసరాలలో వీలైనంత పండగను మరిచేలా ఎన్నికల ప్రకటనల మ్రోత ప్రచార సభలలోని రోత వినడానికి కరువైన శ్రోత హామీలతో ఆర్థిక వ్యవస్థకు వాత ఆర్థిక లోటు తిరిగి ప్రజలపై మోత సాయంకాలం మద్యపానం […]
మహిళ దినోత్సవ శుభాకాంక్షలు ==================== ఓ వనిత నీకు వందనం అడుగడుగునా ఒడిదుడుకులతో ఇమడలేని నీ బతుకు బండి కామాంధుల పడగ తాకిడి దుర్మార్గపు దోపిడీ గుండెల్లో అలజడి కళ్ళనిండా తడి అమ్మ ఒడి చదువుల బడి దేవుని గుడి రక్షణ లేదు నీకు ఎక్కడ పిండం పెరిగి కడుపు దాటడానికి గండం ఎదిగిన బిడ్డ గడపదాటితే సుడిగుండం కొత్త పోకడలు, ఆడంబరాలతో ధరించే జానెడు గుడ్డతో పరువాలు జారవిడిచే […]
సంక్రాంతి శుభాకాంక్షలు =========================== హేమంతపు హిమంను కరిగించి సమస్త తిమిరాలను హరించే భోగిమంటల కాంతి కలిగించెను వైభోగాలతో పసిడి సిరుల కాంతి అంబరాన్ని అంటే సంబరాల నవ్య కాంతి సంక్రాంతి ఒకే చోటికి చేరిన హితులు, సన్నిహితుల మాటామంతి అంతరంగంలోని అగాధాలు అన్ని ఆవిరి చేసి గుర్తు చేసింది అనురాగాలు, అనుబంధాల సంగతి దివికేగిన పెద్దల దీవెనల కొరకు మంగళ హారతి బుజ్జాయిలను బోగి పండ్లతో దీవించే మాతృమూర్తుల అనుభూతి […]
దీపావళి శుభాకాంక్షలు ======================= దీపాలంకృతమై వెలిగే మీ గృహాళి మీ ఇంట ఘల్లు ఘల్లుమనే శ్రీ లక్ష్మి అందెల రవళి దేవదేవుని దీవెనలతో చేకూర్చు భాగ్యాళి నిత్య నూతన కాంతులు విరజిమ్ముతూ వచ్చిన ఈనాటి దీపావళి చామంతులతో చెట్టాపట్టాలు వేసుకొన్న ద్వారాల పచ్చ తోరణాలు లతల్లా దేహానికి అల్లుకుపోయిన నూతన దుస్తులు ఉల్లాసం ఉత్సాహంతో ఉరికే పసిపిల్లలు మంత్రాలు , మంగళ హారతులతో కూడిన దీవెనలు అపశృతులు జరగకుండా మురిపెంగా […]
పరిణయ శుభాకాంక్షలు ===================== పచ్చని తోరణాలు స్వాగతం పలకగా వికసింప బోయే పూల పరిమళం పలకరించగా ఆ పలకరింపులే పన్నీరు జల్లుగా మారగా పరవశించిన మనసులో కలిగిన పులకింతలతో పాలపుంత మధ్యలో పల్లకిలో ఊరేగిన భావన కలగగా పొంగి పొరలే ప్రేమానురాగాలతో ప్రమాణాలే పల్లవి కాగా వేదమంత్రాలు చరణాలై జత కాగా కమ్మని పాట కాగా బంధుమిత్రులు సాక్షులుగా ప్రేక్షకులై దీవించగా తాళి తనువును తాకగా తారలను […]
కదిలి పోయే క్షణాలన్ని కాలవాహినిలో లీనామౌతాయి. కొందరితో గడిపిన కాలం మాత్రం- వీడని నీడలా మనల్ని అంటి పెట్టుకొని వుంటుంది. జీవిత ప్రయాణంలో కళాశాలలో విద్యార్థిగా ఎందరో నేస్తాలు, ఎన్నో ఙ్ఞాపకాలు. కాలచక్రం వెనక్కి తిరిగి మళ్లి అక్కడికే వెళ్ళాలనిపించినా, అది అసంభవం కాబట్టి, నిత్య జీవితంలో యాంత్రికత, ఉరుకులూ,పరుగులూ పెరిగి పోయి, ఎవరికి వారై పోతున్న తరుణంలో, మన నేస్తాలను కలుసుకోవడానికి కొందరికి సమయం లేక పోగా, కొందరు […]
‘స’ అక్షరం తొ మొదలైన ఒకరి పేరు , వారికీ వివాహ శుభాకాంక్షలు తెలిపేందుకు సెంచురీ కి పైగా ‘స’ గుణింతాలతో మొదలైన పదాలతో వ్రాసిన రచన ************************************************************************************************ సరి కొత్త జీవితంలోకి స్వాగతం సుస్వాగతం సంసారమనే సాగర సామ్రాజ్యంలో సంతోష సాగర తీరాన రాజు రాణుల్లా ఒకరి సాన్నిత్యంలో మరిఒకరు సేద తీరుతూ నవ్వుల సవ్వళ్ళతో , సరసాల సరిగమల సల్లాపాలతో సరదాలు ,సంబరాలు ,సందడులను పంచుకుంటూ సమయాన్ని […]