================
క్రమంగా కరువవుతున్న కొమ్మ మీద కోయిలమ్మ కూత
మరుగవుతున్న మనసును మురిపించే సువాసనలను విరజల్లే జాజిమల్లి పూత
వేసవి తాపంతో పెరిగిన ఉక్కపోత
భూగర్భ జలాల తగ్గుదలతో నీటి సరఫరాలో కోత
నాటాలి వృక్షాలను పరిసరాలలో వీలైనంత
పండగను మరిచేలా ఎన్నికల ప్రకటనల మ్రోత
ప్రచార సభలలోని రోత
వినడానికి కరువైన శ్రోత
హామీలతో ఆర్థిక వ్యవస్థకు వాత
ఆర్థిక లోటు తిరిగి ప్రజలపై మోత
సాయంకాలం మద్యపానం దాత
ఎన్నికల సమయంలో నేటి రాజకీయ నేత
విలంబ నామ సంవత్సరం అయ్యింది పాత
వికారి నామ సంవత్సరం అవుతుంది కొత్త
తోరణాలలో మావిడాకులు, ముద్ద బంతి పువ్వుల జత
అద్భుతమైన వంటలు కడుపుకి మేత
పంచాంగ శ్రవణంతో మారదు నీ నుదుట గీత
మార్చుకోవాలి నువ్వే నీ తలరాత
వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండి కళకళలాడాలి అక్షయ పాత్ర
విజయాలతో సాగాలి జీవన యాత్ర
జగమంత జనాలను చల్లగా చూడాలి ఆ జగన్మాత
మరొకసారి ఉగాది శుభాకాంక్షలతో
మీ
రాజీప్రతాప్
=============