‘స’ అక్షరం తొ మొదలైన ఒకరి పేరు , వారికీ
వివాహ శుభాకాంక్షలు తెలిపేందుకు సెంచురీ కి పైగా ‘స’ గుణింతాలతో మొదలైన పదాలతో వ్రాసిన రచన
************************************************************************************************
సరి కొత్త జీవితంలోకి స్వాగతం సుస్వాగతం
సంసారమనే సాగర సామ్రాజ్యంలో సంతోష సాగర తీరాన రాజు రాణుల్లా ఒకరి సాన్నిత్యంలో మరిఒకరు సేద తీరుతూ నవ్వుల సవ్వళ్ళతో ,
సరసాల సరిగమల సల్లాపాలతో సరదాలు ,సంబరాలు ,సందడులను పంచుకుంటూ
సమయాన్ని సరిగ్గా సద్వినియోగ పరుచుకోవాలని
సత్యభామలా సాధించకుండా , ఒకరి ప్రతాపం మరిఒకరిపై చూపకుండా
మనసున సుమ గంధాలు నింపే సన్నజాజుల్లా , సుగంధభరితమైన సన్నజాజుల సువాసనల సుతారపు రెమ్మలపై వాలే సీతకోకచిలుకలా
సహాయ సహకారాలను అందించుకుంటూ
సమస్యలను సైతం సమయస్ఫూర్తితో ఇద్దరి సమక్షంలో సమీక్షించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని
ఇద్దరి మధ్య సంభాషణలు శృతిమించని సున్నితమైన సౌమ్యమైన సన్నాయి సంగీతంలోని స్వరంలా సరాగంలా రంజింప చేసేలా ఉండాలని
సతిపతుల సన్నిహితులను సరిపాలతో సరిసమానముగా సవినయంతో చూసుకొని
సాంప్రాదాయానికి నిదర్శనంగా సత్స సంబంధాలను పెంచుకోవాలని
కెరటాలు లేని సముద్రమైన ఉండొచ్చు కానీ
సమస్యలు లేని సంసారం ఉండదనే జీవిత సత్యాన్ని గ్రహించి
స్వాతంత్రం కోల్పోయామని బాధపడకుండా
స్వచ్ఛమైన మనసుతో హద్దులు మీరని ఒకరి స్వేచ్చకు మరిఒకరు భంగం కలగకుండా సగౌరంగా స్పందిస్తూ ఒకరి స్వప్నాలకు మరిఒకరు సౌధం కావాలని
జీవన గమనంలో ఎదురయే సునామీలైనా , సుడిగుండలైనా , సుఖదుఃఖలైనా
సంఘటితంగా సునాయాసంగా సకాలంలో ఎదుర్కొని సందేహాలను తగిన సమాధానాలతో నివృత్తి చేసుకుంటూ
సహనంతో సమన్వయంతో తప్పులను సరిదిద్దుకుంటూ
సూచనలను , సలహాలను స్వీకరిస్తూ
మీ సంకల్పాలను సాధించుకొని విజయ సోపానాలను అధిరోహించి మీ సంసార జీవితం సకల సౌకర్యాలతో ,సిరి సంపదలతో ,ఉత్తమ సంతానంతో సాదరంగా , సంక్షేమంగా సాగిపోవాలని స్ఫూర్తి దాయకంగా , మధుర స్పృతులుగా మిగిలిపోవాలని సాష్టాంగ నమస్కారంతో ఆ సత్యనారాయణ స్వామిని స్మరిస్తూ
ఏడు అడుగులతో ఆరంబించి జీవితం అనే సుదిర్ఘ ప్రయాణంలో చివరి వరకు నీతో పాటు నడిచే ఏకైక ప్రియాతి ప్రియమైన నేస్తంతో మొదలైన స్నేహ బంధం ప్రణయ బంధం అనే సంబంధంగా మారుతున్న సుమూహుర్తంలో పెళ్లి సందడి సందర్భంగా సహృదయ పూర్వక వివాహ శుభాకాంక్షలతో
–రాజీప్రతాప్
********************************************
Super Prathap