దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు
=======================

దీపాలంకృతమై వెలిగే మీ గృహాళి
మీ ఇంట ఘల్లు ఘల్లుమనే శ్రీ లక్ష్మి అందెల రవళి
దేవదేవుని దీవెనలతో చేకూర్చు భాగ్యాళి
నిత్య నూతన కాంతులు విరజిమ్ముతూ వచ్చిన ఈనాటి దీపావళి

చామంతులతో చెట్టాపట్టాలు వేసుకొన్న ద్వారాల పచ్చ తోరణాలు
లతల్లా దేహానికి అల్లుకుపోయిన నూతన దుస్తులు
ఉల్లాసం ఉత్సాహంతో ఉరికే పసిపిల్లలు

మంత్రాలు , మంగళ హారతులతో కూడిన దీవెనలు
అపశృతులు జరగకుండా మురిపెంగా చెప్పే అనురాగ వచనాలు
ఆరగించేందుకు అమ్మ చేతి కమ్మని అరిసెలు

తారంగం ఆడిస్తున్న టపాకాయల శ్రవణ తరంగాలు
అంతరంగంలో మెదిలే ఆనంద తరంగాలు

సంధించిన తారాజువ్వల మెరుపు కిరణాలు
పెదవులపై వెలిగిన చిరునవ్వుల దీపాలు
మదిలో ముద్రించుకున్న మధురానుభూతులు

జీవన పయనంలోని ఆరాటాలు, పోరాటాలు విజయపధంలో దూసుకు పోయి ఆనంద తాండవం చేయాలని ఆశిస్తూ లక్ష్మీ కటాక్షం మనకందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ

మరొకసారి దీపావళి శుభాకాంక్షలతో

–రాజీ ప్రతాప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *