నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు

నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు
*************************************************************

పరుగులతో … పలుకులతో …
చిరునవ్వులతో … చిరుజల్లులతో …
కుదుపులతో … మలుపులతో …
మనుషులతో … మనసులతో … మదితలపులతో …

తీపి చేదు కలగలుపు అనుభూతులు
ఆనందాలు మరియు అనుభవాలై
ఆనాటి స్మృతులు నిక్షిప్త నిధులుగా
జ్ఞపకాల గ్రంధాలయంలో అత్యంత పదిలమై

గతించిన గత సంవత్సకాలం కాలసముద్రంలో
కదిలిపోయి కరిగిపోయి క్రమ క్రమంగా కనుమరుగై

నవ వసంతానికి నాంది పలుకుతూ
కనుల ముందు వీనులకు విందుగా
కోటి కోరికలతో, కను కొలనులలోని కలలతో
కొత్తగా సరికొత్త సంవత్సరం సంబరాల సందడలతో
కేకులతో, కేకలతో,కేరింతలతో
ప్రారంభమవుతున్న శుభఘడియలలో

బతుకు పుస్తకంలోని పుటలలో
మీ జీవిత గమనంలోని గమ్యం వైపు దిశ దశలను నిర్ణయించుకొని లిఖించి
కాలంతో నేస్తం చేసి కాలంతో కదులుతూ
విజయశిఖరాలను అధిరోహించాలని

ప్రతిక్షణం, ప్రతినిమిషం, ప్రతిగంట,
ప్రతిరోజు,ప్రతివారం,ప్రతిమాసం,
సంవత్సరమంతా సకల సంపదలతో
మీ సంకల్పాలను సాధించుకొని,
సంక్షేమంగా సాగిపోవాలని,
స్ఫూర్తిదాయకంగా మిగిలిపోవాలని

చిరునవ్వుల పువ్వులను విసురుతూ
పలకరింపుల పన్నీరును జల్లుతూ

ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ
ఆంగ్ల సంవత్సరాది కంటే మన తెలుగు సంవత్సరాది ఐన ఉగాదికి ఎక్కవ ప్రాముఖ్యతను ఇవ్వాలని ఆశిస్తూ

మరివొక సారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో

——మీ రాజీప్రతాప్
*************************************************************************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *