కళాశాలలోని నేస్తాల ఙ్ఞాపకాలు

కదిలి పోయే క్షణాలన్ని కాలవాహినిలో లీనామౌతాయి. కొందరితో గడిపిన కాలం మాత్రం- వీడని నీడలా మనల్ని అంటి పెట్టుకొని వుంటుంది.
జీవిత ప్రయాణంలో కళాశాలలో విద్యార్థిగా ఎందరో నేస్తాలు, ఎన్నో ఙ్ఞాపకాలు.
కాలచక్రం వెనక్కి తిరిగి మళ్లి అక్కడికే వెళ్ళాలనిపించినా, అది అసంభవం కాబట్టి,
నిత్య జీవితంలో యాంత్రికత, ఉరుకులూ,పరుగులూ పెరిగి పోయి, ఎవరికి వారై పోతున్న తరుణంలో,
మన నేస్తాలను కలుసుకోవడానికి కొందరికి సమయం లేక పోగా, కొందరు సమయాన్నిసరిగ్గా సద్వినియోగం చేసుకోకపోగా,
మరికొందరు సుదూర దూరాలలో ఉంటూ అందుబాటులో లేకపోగా, కనీసం వాళ్ళను తలుచుకోవడానికి
కొంత సమయం హెచ్చిస్తే ఎలా వుంటుంది అనే ఆలోచనే -ఈ రచన ప్రయత్నం.

మన మదిలో వాళ్లతో గడిపిన ఙ్ఞాపకాలు
వారితో పంచుకున్నఅబిప్రాయాలు,
వారు తెలిపిన అభినందనలు,
వారు చూపే అభిమానాలు,
వారితో తీర్చుకున్న అవసరాలు,
వారితో నేర్చుకున్న అలవాట్లు,
వారితో చెప్పిన అబద్ధాలు,
వారితో ఆడిన ఆటలు,
వారితో తాగిన ఆమృతాలు,
వారు చూపిన ఆత్మ్హీయతలు,
వారు కురిపించన ఆప్యాయతలు,
వారు చూపిన అనురాగాలు,
వారు చూపిన అనుగ్రహాలు,
వారిలో చూసిన ఆగ్రహాలు,
వారి తోటి అనుభూతులు,
వారి వలన కలిగిన అనుభవాలు,
వారి తోటి ఆనందాలు,
వారిలో కలిగిన అనుమానాలు,
వారితో కలిసి చేసిన ఆందోళనలు,
వారిలో చూసిన ఆవేశాలు
వారిలో కలిగిన ఆవేదనలు
వారిపై కలిగిన అసూయలు,
వారు చెప్పిన అప్రమత్తలు,
వారికోసం మన ఆతృతలు,
వారు అందించిన ఆశీస్సులు,
వారి (అమ్మాయిలు) వలన రేగిన అలజడులు,
వారి కోసం ఆలోచనలు,
వారి మధ్య ఆకర్షణలు,
వారు మన పై ఉంచిన అంచనాలు,
వారితో చేసిన ఆఙ్ఞాపనలు,
వారి ఫైన మన ఆశలు,
వారి వలన జరిగిన ఆత్మ పరిశీలనలు,

అంతు లేని అనుభూతులు,
అబ్బుర పడే ఆనందాలు,
ఆనకట్ట లేని ఆమృతాలు,
అలంకరణతో కూడిన అందాలు,
అందాల వలన కలిగిన ఆకర్షణలు,
అంతరంగంలో రేగిన అలజడులు,
అపహరణకు గురైన అమ్మాయిల అంతరంగాలు,
అనుగ్రహం పొందక అదృశం ఐన ఆశలు,
అలుపు అలసట లేని ఆటలు,
అల్లుకుపోయిన ఆప్యాయతలు,
అవధులు దాటిన ఆవేదనలు,
ఆవేదనతో కూడిన ఆరాటాలు,
అగాధాల వంటి ఆలోచనలు,
ఆయాసంతో కూడిన ఆవేశాలు,
అంతరాల వలన కలిగిన అపార్థాలు,
అపురూపమైన అనుభావాలు,
ఆనాటి ఙ్ఞాపకాలే ఈనాటికి ఆనవాలు,

అందరికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుస్సును, అందిచాలని,
అందరి ఆనందం, ఆదాయం ఆరోహణ క్రమంలో అభివృద్ధి చెందాలని ఆ ఆంజనేయ స్వామిని ఆలపిస్తూ, ఆరాదిస్తూ,

————-రాజీప్రతాప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *