తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు

తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు
************************************

ఉప్పెనలా ఉవ్వెత్తుగా లేచే ఉద్వేగాలకు , ఉద్రేకాలకు స్థానం కాకూడదు నీ గుండె గది

ఉల్లాస వీచికలతో కొత్త ఊహలకు , ఊసులకు ఊతమిచ్చి ఉత్తేజంతో ఉరకలేయాలి నీ మది

ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఉరిమే ఉత్సాహం , ఉప్పొంగే ఉల్లాసం ఉత్ప్రేరకమై
ఉన్నత లక్ష్యాలను ఛేదించి ఉన్నతంగా ఎదగాలి ఈ ఏడాది

ఉప్పెక్కించుకున్న బాధ్యతల కోసం ఉరుకులు పరుగులతో ఆగక సాగే పయనమిది

విళంభ నామ సంవత్సరాది కావాలి వెల్లువిరిసే విజయాలకు నాంది

చైత్రం నుండి పాల్గుణం వరకు నిండాలి నీ ఆనందాల నిధి

ఉత్సవాలు ఊరేగింపులతో ఉగాది అందరికి అవ్వాలి అది శుభాది

************************************
ఇంతటితో ఉపసంహారించుకుంటూ అందరికి
తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు అందిస్తూ
–మీ రాజీ ప్రతాప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *