మూడవ భాగం
మరుసటి రోజు ఇంకొక సీనియర్ రూమ్
ఈ సీనియర్లు హరి మెస్( శ్రీనివాస థియేటర్ ఎదురుగా) కు వచ్చేవాళ్ళు
నేను: SD చెప్పడం
సీనియర్: ఏదయిన జోక్స్ చెప్పు.
నేను: నాకు జోక్స్ రావు.
సీనియర్: సినిమాలు బాగా చూస్తావా
నేను: చూస్తాను సార్.
సీనియర్: ఏదయినా రొమాంటిక్ సీన్ డైలాగ్స్ తో సహా చెప్పు.
నేను: తొలి ప్రేమ లోని లాంటిది తొలిచూపు/తొలి కలయిక గురుంచి చెప్తాను సార్.
సీనియర్: బోర్ కొట్టకుండా వుండాలి.
—-
నా స్థానంలో మీరు ఉన్నట్లు ఊహతో ఆస్వాదించి చదవండి. మీ కళ్ళ ముందు కింద సన్నివేశం మీకు కనిపిస్తుంది
——-
అది అప్పుడే చీకటి పడుతున్న సాయంత్రం వేళ. చీకటికి తోడు మెరుపులతో కూడిన తొలి చినికులు పడుతున్న వేళ.
నేను ఊరికి వెళ్ళేందుకు బస్సు స్టాప్ లో వేచి ఉండగా
సముద్ర తీరంలో విహరించే సాయంత్రపు చల్లటి గాలిలా ఎక్కడ నుండో వచ్చినదో తెలియదు గాని, ఒక అమ్మాయి బస్సుస్టాప్ పక్కనే వున్న
పూల దుకాణం దగ్గరికి వచ్చి పూలు తీసుకుంటుండగా ఒక వర్షపు బిందువు ఆమె చెక్కెలి మీద పడి జారుదుండగా అదే దుకాణంలోని
రోజా పూల మీద చల్లిన నీటి బిందువులు ఆమె చెక్కెలిని తాకే భాగ్యం తమకు దక్కలేదని వర్షపు బిందువులను చూసి ఈర్ష్య పడుతునట్లు గా అనిపించిది.
ఇంతలో ఆమె చూపులతో నా చూపులు ఏకి బవించగా
ఆమె చూపు నిర్మలంగా , నిశ్చలంగా, గంబీరంగా ఉన్ననా హృదయాన్ని
సున్నితంగా, సుతారంగా, సుతిమెత్తగా ముద్దాడగా ఎదలో కోటి మెరుపులు మెరిసి
ఆ మెరుపుల వెలుగులు కలకాలం ఉంటె బాగుండేది అనే భావోవ్దేగం కలగగా నా హృదయం క్షణ కాలం పాటు ఎగురుతూ పారవశ్యంతో స్వర్గంలోకి తీసుకొని వెళ్లి విహరిప చేసినట్లుగా అనిపించిది.
ఇంతలో ఆ అమ్మాయి బస్సు స్టాప్ లోకి వస్తుండగా తేమకి జారి పడినది.
నేను వెంటనే వెళ్లి ఆమె చేతికి నా చేయి అందంచి లేపగా
ఆమె చేతి తొలి స్పర్శ తో నా శరిరంలో రేగిన వేడి నా నుదిట స్వేద బిందువులుగా మరి జారుతూ ఉండగా
ఓ అద్బుతం ఐనా పరిమళం ఆమె నుండి వెలువడి నా శ్వాసలో దూరి ఓ ఆనందంతో ఊపిరి ఆడక తిరిగి నిశ్వాస రూపంలో బయటికి వచ్చింది.
ఆమె నాకు ధన్యవాదాలు తెలిపి బస్సు కోసం అటు తిరగగా ఆమె పొడుగైన కురులు నా మొఖాన్ని తాకగా నా మనసు పులకరించి గాలికంటే తెలైకైనట్లు అనిపించినది.
ఇంతలో ఆమె ఎదురు చూస్తున బస్సు వచ్చి,
ఎగిరెగిరి ఉవ్వెత్తున లేచిన అల వుడ్డున తాకి తలొంచుకుని నిశ్చబ్దంగానిష్కరమించినట్లుగా అందులోఆమె వెళ్లి పోయింది.
నాకు మాత్రం స్వర్గం చేజారినట్లు అయింది. ఎదో అలజడి మనసుని ఊపేస్థూ చేరువైన పరిచయం శాశ్వతం కాలేదని కాలం భారంగా అడుగులు వేసింది.
—–
ఫై వాక్కములు నా(నీ/మీ) ఊహా సుందరికి అంకితం.
—-
——మీ రాజీప్రతాప్
*************************************************************************
Wow! Pleasantly surprised. It’s naughty, teasing and highly romantic (that’s a shock as I never realized that angle in you all these years of friendship). Very poetic and nicely articulated. Keep it up and keep writing but true to your feelings (even if you were attracted to a girl, which is quite normal in that age) and accept them honestly without saying ‘dream’ after all ;).